పేద కుటుంబానికి ఎల్‌ఓసీ చేయూత

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

పేద కుటుంబానికి ఎల్‌ఓసీ చేయూత
– బాధితురాలికి రూ.2.50లక్షల మంజూరు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సీఎం సహాయ నిధి కింద రూ.2.50లక్షల సాయం అందింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ ప్రాంతానికి చెందిన మమత అనారోగ్యానికి గురైంది.

హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో కుటుంభీకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని సంప్రదించారు. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సీఎం సహాయ నిధి కింద కుటుంబానికి రూ.2.50లక్షల ఎలసీని మంజూరు చేయించారు. మంగళవారం ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు రాజేష్ ద్వారా కుటుంబానికి ఎల్బీసీని అందజె శారు. ఈ సందర్భంగా బాధిత కుటుంభీకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

కరెంటు ఆఫీసులో కూలీ మృతి