తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
– పార్టీలకతీతంగా తాండూరు పట్టణాభివృద్ధి
– తాండూరును ఆదర్శ మున్సిపల్‌గా మారుస్తాం
– గల్లిగల్లికి ఎమ్మెల్యే ముగింపులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటిని ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆగస్టు 23న తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన గల్లిగల్లికీ ఎమ్మెల్యే కార్యక్రమం మంగళవారం సాయంత్రం ముగిసింది. అదేరోజు రాత్రి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అధ్యక్షతన ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ 23వ తేది నుంచి ప్రతిరోజూ 6 వార్డుల చొప్పున మొదటి విడతలో 18 వార్డులు పూర్తిచేయడం జరిగిందని గుర్తుచేశారు. రెండో విడతలో మిగతా వార్డులను పూర్తి చేయడం జరిగిందన్నారు. మొత్తం 36 వార్డుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి 790 సమస్యలను గుర్తించామని, ఇందులో పారిశుద్ధ్యం 166, డ్రైనేజీ 146, విద్యుత్ సమస్యలు 62, సీసీ రోడ్డు సమస్యలు 139, కల్వర్టు సమస్యలు 44, మిషన్ భగీరత 46, నీటీ సమస్య 1, విద్యుత్ స్థంభాల సమస్యలు 37, ఫెన్షన్ సమస్యలు 103, అంగన్‌వాడి సొంత భవనాలు 22, కమ్యూనిటీ భవనాలు 4 సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత వరుసరగా ఎన్నికలతో మొదటి యేడాది పూర్తికాగా.. రెండో సంవత్సరం కరోనా వల్ల పాలన అస్తవ్యస్థమయ్యిందన్నారు. ఇటీవలే పరిస్థితులు అదుపులోకి రావడంలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు గల్లిగల్లీకి ఎమ్మెల్యే చేపట్టడం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా పట్టణంలోని ప్రతి వార్డు సమస్యలను పరిష్కరించి తీరుతామన్నారు. చిన్న చిన్న సమస్యలపై ఆయా వార్డుల కౌన్సిలర్లు బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాకారంతో తాండూరుకు నిధులు తీసుకవచ్చి… తాండూరు మున్సిపల్‌ను ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు.
సీనీయర్ కౌన్సిలర్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
గల్లిగల్లికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డిని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సన్మానించారు. వార్డుల పర్యటనలో కాళ్లకు చెప్పులు లేకుండా తనతో పాటు పర్యటించి ఉత్సహాం నింపారని నీరజారెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటి చైర్‌పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల, యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్లు బొబ్బిలి శోభారాణి, సోమశేఖర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, ఆసిఫ్, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, రాజుగౌడ్, అఫ్పూ(నయూం), పట్లోళ్ల నర్సింలు, సీనియర్ మహిళ నాయకురాలు, కౌన్సిలర్ విజయాదేవి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, బోయరవి, వెంకన్నగౌడ్, భీంసింగ్, ప్రభాకర్‌గౌడ్, అంతారం లలిత, సంగీత ఠాకూర్, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

