హస్తం మద్దతు దారులను గెలిపించుకుందాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తం మద్దతు దారులను గెలిపించుకుందాం..!
– కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
– నియోజకవర్గంలో మద్దతుదారుల కోసం విస్తృత ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీ మద్దతు దారులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శుక్రవారం తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పంచాయతీ సర్పంచు అభ్యర్థుల తరుపున గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మద్దతు దారులను గెలిపించుకునేందుకు కృషి చేయాలన్నారు.

ప్రజలు కాంగ్రెస్ మద్దతుదారుల అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని, అభ్యర్థి గూర్చి వివరించి, అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబాటు ఉందని ప్రజలకు నమ్మకం కల్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి గ్రామ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని బిఎస్‌ఆర్ గారు ప్రజలను కోరారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో ఘనంగా నేవీ దినోత్సవం