ఓటర్లుగా నమోదు యువత బాధ్యత

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటర్లుగా నమోదు యువత బాధ్యత
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
– పీపుల్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓటర్లుగా నమోదు అయ్యే బాధ్యత యువతపై ఉందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంశకర్ ప్రసాద్ అన్నారు. శనివారం తాండూరు పట్టణం పీపుల్స్ డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ విద్యార్థులతో మాట్లాడారు. సమాజంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిందన్నారు. మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలంటే ఓటు హక్కుతోనే సాధ్యమవుతుందన్నారు. కావున యువత ఓటరుగా హక్కును నమోదు చేసుకోవాలన్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండే ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు తహసీల్దార్ తారాసింగ్, కాలేజీ ప్రిన్సిపల్, అద్యాపకులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

వైన్‌ షాపులో పడ్డ దొంగ..!