కుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrకుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..!
– బైకుపై వేసుకుని జారుకున్న దుండుగులు
– తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కలను ఎత్తుకెళ్లిన సంఘటనలు ఇప్పటి వరకు సినిమాల్లో చూసి ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంటాయి. వాటికేం తీసిపోదు అన్నట్లు ఓ కుక్కను ఎత్తుకెళ్లిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఓ ఇద్దరు దుండగులు కుక్కను ఎత్తుకుని బైకుపై పరారయ్యారు.

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని యాదిరెడ్డి చౌరస్తాకు చెందిన వెంకటేష్‌(ఆశ శారీసెంటర్) అనే వ్యక్తి తన కుక్కను చిక్కి అనే పేరుతో పెంచుకుంటున్నాడు. ఆదివారం ఉదయం 9గంటల ప్రాంతంలో తన కుక్కను బైకుపై తీసుకెళ్లాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని స్నేహ చికెన్ సెంటర్ వద్ద తెలిసిన వ్యక్తిని కలిసేందుకు వెళ్లాడు. అప్పుడు కుక్కును తాడుతో బైకుకు కట్టేసి లోపలికి వెళ్లాడు. బయటకు వచ్చి చూసే సరికి కుక్క కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.

కొద్ది సేపటి తరువాత సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ బైకుపై వచ్చిన ఇద్దరు యువకులు తాడుతో ఉన్న కుక్కను పట్టుకున్నట్లు కనిపించింది. ఒకరు ముందుకు వెళ్లి కుక్కను ఎత్తుకు రాగా మరోకరు బైకుతో సిద్దంగా ఉండి తీసుకున్న వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. యజమాని సోషల్ మీడియాలో తన కుక్క తప్పిపోయినట్లు పోస్టింగ్ చేశారు. దీంతో కుక్కును ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్ల సంఘటన వెలుగులోకి వచ్చింది. కుక్క ఆచూకీ తెలిసిన వ్యక్తులు తనను సెల్‌: 7416767655, 9985208430లకు సంప్రదించాలని యజమాని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి…

స్వీప్‌ చేసి.. స్లీప్..!