లక్షలకు ఎసరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

లక్షలకు ఎసరు..!
– టెండర్ లేకుండా మెటిరియల్‌
– స్పెషల్‌ ఆఫీసర్‌ రైట్‌ వేయడంతో కొనుగోలు
– బల్దియా దుబారా భాగోతంపై విమర్శలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌లో అధికారులు లక్షల నిధులకు ఎసరు పెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు అందించే అలవెన్స్ మెటిరీయల్‌ కొనుగోళ్లపై తీవ్ర దుమారం రేగుతోంది. కేవలం స్సెషల్ ఆఫీసర్ అనుమతి తీసుకుని.. ఎమ్మెల్యే ఆమోదం లేకుండా కొనుగోలు చేయడంపై అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తాండూరు మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా సుమారు 250 వరకు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి యేడాది పారిశుద్ధ్య కార్మికులకు అలవెన్స్ మెటిరీయల్ కింద కొబ్బరి నూనె, సబ్బులు, సలికెలు, చెప్పులు, బెల్లం వంటి తదితర సామాగ్రిని అందజేశారు. వీటికి కోసం తాండూరు మున్సిపల్ నుంచి ప్రతి యేడాది రూ. 10 నుంచి 20 లక్షల వరకు ఖర్చు చేస్తారని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీనికి టెండర్లు ఆహ్వానించి.. కాంట్రాక్టర్ ద్వారా కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇదే విషయంపై గత కౌన్సిల్‌లో పారిశుద్ధ్య కార్మికుల మెటిరీయల్ కొనుగోలు కోసం రూ. 40లక్షల ప్రతిపాదన తీసుకవస్తే అందరు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా అ అంశాన్ని పక్కన పెట్టాలని సూచించారు.

అయితే ఇటీవల మున్సిపల్ అధికారులు ప్రత్యేకాధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ కుమార్ ద్వారా అనుమతి తీసుకుని టెండర్లు లేకుండా మెటిరీయల్ కొనుగోలు చేశారు. గతంలో తిరస్కరించిన రూ. 40లక్షలతో కాకుండా ఏకంగా అరకోటి అంటే రూ. 50లక్షలతో మెటిరీయల్‌ను కొనుగోలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మున్సిపల్ కార్యాలయంలో కార్మికుల పేరుతో నిధులను దుబారా చేయడం పట్ల అధికార పార్టీ నేతలు, మాజీ కౌన్సిలర్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేకు తెలియకుండా టెండర్లు వేసి కొనుగోలు చేయడం.. లక్షలకు ఎసరు పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడ చదవండి…

మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!