పాఠశాల పనుల్లో వేగం పెంచాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrపాఠశాల పనుల్లో వేగం పెంచాలి
– తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– పట్టణంలో అమ్మ ఆదర్శ పనుల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాలల అభివృద్ధి కోసం చేపడుతున్న పనులలో వేగం పెంచాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డితో కలిసి పట్టణంలోని మల్ రెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలతో పాటు రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఆయా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఇతర మౌళిక సదుపాయాల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని మెప్మా సిబ్బందిని, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోయరవి, హెచ్ఎంలు అనురాధ, జూనియర్ అసిస్టెంట్ నీరటి శ్రీనివాస్, వర్క్ ఇనుస్పెక్టర్ మహేష్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రమేష్‌ కుమార్