నిమజ్జన ఖర్చులపై తప్పుడు ప్రచారం తగదు
– బిల్లులలో ఎలాంటి అవినీతి లేదు
– తాండూరు హిందూ ఉత్సవ సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో నిర్వహించిన గణేష్ నిమజ్జన ఖర్చులపై తప్పుడు ప్రచారం తగదని హిందూ ఉత్సవ సమితి సభ్యులు అన్నారు. శనివారం హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు రాజుగౌడ్, ప్రధాన కార్యదర్శి సాయిపూర్ బాల్‌రెడ్డిలు సభ్యులతో కలిసి మీడియాంతో మాట్లాడారు. ఈ యేడాది తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ అశోక్ కుమార్, పోలీసు అధికారుల సహాకారంతో వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. అయితే నిమజ్జన సమయంలో మున్సిపల్ నుంచి చేపట్టిన ఖర్చులపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఆర్అండ్‌బి, రెవెన్యూ అధికారుల శాఖల నుంచి సహాకారంలో ఆలస్యం జరగడంపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ అశోక్ కుమార్ స్పందించి సహాయక చర్యలు తీసుకున్నారని తెలిపారు. పట్టణంలో మిషన్ భగీరథ పనుల వల్ల గోతులు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చేందుకు డస్ట్ వినియోగించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కాగ్నానది వద్ద ప్రత్యేక జేసీబీ, ఇటాచీ వాహనాలు ఏర్పాటు చేశారని, బారికేడ్లు, విద్యుత్ లైట్ల ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు మున్సిపల్ నిబంధనల ప్రకారం టెండర్లు వేయడం జరిగిందన్నారు. నిమజ్జన ఖర్చుల్లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. సాంప్రదాయంగా జరుపుకునే పండగలపై తప్పుడు ప్రచారం చేయడం మంచిదికాదన్నారు. ఈ కార్యక్రమంలో సమితి కోశాధికారి బోయరాజు, సహాయ కార్యదర్శి బంటు మల్లప్ప, ఉపాధ్యక్షులు అంతారం కిరణ్, తాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.
