27న హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ఈనెల 27న హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సభ నిర్వహించబోతున్నారు. రాష్ట్రంలోని ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రత్యర్థి బీజేపీని ఎలాగైనా మట్టి కరిపించాలని తీవ్ర కసరత్తు ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగా ఆదివారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ పార్టీ సంస్థగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి పక్షాలకు దిమ్మదిరిగేలా వరంగల్ ప్రజా గర్జన ఉంటుందని అన్నారు. అదేవిధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 27న హుజూరాబాద్‌లో కేసీఆర్ సభ నిర్వహించనున్నారు.
