కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్ తీరు సిగ్గుచేటు
– మహిళ బిల్లు వ్యతిరేకించడం దుర్మార్గం
– బీజేపీ మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల పట్ల కాంగ్రెస్ తీరు సమాజానికి సిగ్గుచేటని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్, మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌ విమర్శించారు.

చట్టసభల్లో మహిళలకు అధికారం కలిపించాలని ఉద్దేశంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపడితే అందరు హర్షిస్తున్నారని తెలిపారు.

కాని పార్లమెంట్ సమావేశంలో కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి మహిళలను అవమాన పరిచే రీతిలో నడుచుకోవడం భావ్యం కాదని అన్నారు. మహిళలంటే కేవలం సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాత్రమే అన్నట్లుగా భావిస్తున్నారని విమర్శించారు. మహిళలను కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేస్తామన్నా దోరణిలో పార్లమెంట్లో మహిళ బిల్లును ఆమోదించకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు. జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను అవమానపరిచేలా చేస్తున్న కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

హిందూవులందరు తరలిరండి..!