అధికారం కోసమే డీలిమిటేషన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అధికారం కోసమే డీలిమిటేషన్..!
– మహిళ బిల్లును అడ్డం పెట్టుకుని కుట్ర
– దక్షణాది రాష్ట్రాలకు జరిగే నష్టంపై ఉద్యమం
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టేందుకు డీలిమిటేషన్‌ను చేపడుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

గురువారం తాండూరు మున్సిపల్ కార్యాయలంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం దొంగదారిలో మళ్లీ అధికారం చేపట్టేందుకు డీలిమిటేషన్ బిల్లును ప్రవేశ పెడుతుందని విమర్శించారు. లోక్ సభ స్థానాల బిల్లులు, మహిళ రిజర్వేషన్ల బిల్లులను వేరువేరుగా ప్రవేశ పెట్టాల్సి ఉండేదని అభిప్రాయ పడ్డారు. డీలిమిటేషన్ బిల్లు పూర్తిగా అశా… యంగా ఉందని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లతో ప్రవేశ పెట్టాలని నిర్ణయించిందని గుర్తుచేశారు.

బీజేపీ కొత్తగా ప్రవేశ పెడుతున్న ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే డీలిమిటేషన్ మాత్రం బీజేపీ ప్రభుత్వం నాలుగోసారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2011 జనాబా ప్రకారం డీలిమిటేషన్ చేయడం లేదని అన్నారు. ఇప్పుడున్న జీఎస్టీ ద్వారా, ఆధాయ మార్గాల ద్వారా దక్షణాది రాష్ట్రాల నుంచి లబ్దిపొందుతున్నారని అన్నారు. మహిళ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ చేస్తున్నారని, అలా చేస్తే కేంద్రానికి పుట్టగతులు ఉండవని అన్నారు. అశా..యంగా చేపట్టడం వల్ల దక్షణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని అన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తదితరులు ఉన్నారు.

సమ్మర్‌లో సూపర్‌ డ్రింక్స్‌..!