మా సొంత భూమిపై తప్పుడు ప్రచారం
– ప్రభుత్వానిదే అని రుజువు చేస్తే భూమినే వదిలేస్తా
– అనుమతులతోనే నిర్మాణాలు చేపడుతున్నాం
– బ్లాక్ మేయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది
– మీడియాతో మాట్లాడిన అబ్దుల్ అహద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా సొంత భూమిపై కొందరు కావాలనే తప్పుదు ప్రచారాలు చేస్తున్నారని, ప్రభుత్వానిదే అని రుజువు చేస్తే రూపాయి లేకుండా భూమిని వదిలేస్తామని తాండూరు మైనార్టీ నేత అబ్దుల్ అహద్ అన్నారు.

తాండూరు మున్సిపల్ ముందు ఉన్న ప్రాంతం సర్వేనెంబర్ 130లో 36 గుంటల భూమి కాంగ్రెస్ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆక్రమణకు పాల్పడ్డారని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అమీర్ అబ్దుల్లా తండ్రి, ముస్లిం వెల్పేర్ నాయకులు అబ్దుల్ అహద్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. సర్వేనెంబర్ 130లోని 36 గుంటల భూమి ప్రభుత్వానిది కాదని, పట్టా భూమిని చెప్పుకొచ్చారు. అట్టి భూమి 1983లోనే రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని తెలిపారు.

అప్పట్లో పన్నులు కూడా వసూలు చేశారని, భూమికి హద్దులు కూడా నిర్ణయించారని వివరాలు చూపించారు. అన్ని ఆధారాలను చూసాకే 2023లో తమ ముగ్గురు కుమారులపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. వివాదాలపై కోర్టుకు కూడా వెళ్లడం జరిగిందని తెలిపారు. 36 గుంటల భూమిలో చేపడుతున్న నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులకు దరఖాస్తులు కూడా చేసుకున్నామని తెలిపారు.

తమ భూమిని ప్రభుత్వానిదే అని రుజువు చేస్తే ఉన్నచోటే రూపాయిలేకుండా భూమిని వదిలేస్తామని సవాల్ చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ బ్లాక్ మేయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బ్లాక్ మేయిల్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లేదంటే వారికి తగిన గుణపాఠం చెప్పే తీరుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుమారులతో పాటు పలువురు మైనార్టీ నేతలు ఉన్నారు.


