తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌ను మున్సిపల్ కౌన్సిలర్, బీజేపీ మహిళ మోర్చ వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత సన్మానించారు. ఆదివారం తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉత్తమ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కౌన్సిలర్ సాహు శ్రీలత ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఆర్డీఓ అశోక్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించారు. అదేవిధంగా ఆర్డీఓకు భగవద్గీత పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, యువ నాయకులు రజనీకాంత్ తదితరులు ఉన్నారు.
