తుల్జాపూర్ భవాని మాత భక్తుల సేవలో..!
– అన్నప్రసాదం పంపిణీ చేసిన హిందూ ఉత్సవ సమితి
– అల్పాహారం పంపిణీ చేసిన ఓంకార్ సేవా సమితి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి తుల్జాపూర్ లో వెలసిన భవాని మాతను దర్శించుకునేందుకు వెళుతున్న భక్తుల సేవలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి, ఓంకార్ సేవా సమితి సభ్యులు తరించారు. ప్రతి యేడాది మాదిరిగానే హిందూ ఉత్సవ సమితి సభ్యులు షోలాపూర్ నుంచి పాదయాత్రగా వెళ్లే భక్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నప్రసాదంను పంపిణీ చేశారు.

ఆదివారం హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో తాండూరు ప ట్టణంలోని రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని ప్రసాదం పోట్లాలను భక్తులకు అందజేశారు. పట్లోళ్ల నర్సింలుతో పాటు సభ్యులు పర్యాద రామకృష్ణ, మంతన్ గౌడ్ అశోక్, మిర్చి వెంకట్, పరమేష్, కుమార్ వాల్మీకీ, కోట్ల రాజు, తాండ్ర నరేష్, లోకేష్, టైలర్ రమేష్ తదితరులు కూడా భక్తులకు అన్నప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేశారు.

అదేవిధంగా తాండూరుకు చెందిన ఓంకార్ సేవా సమితి సభ్యులు కూడా భక్తుల పట్ల సేవా తత్పరతను చాటుకుంటున్నారు. షోలాపూర్ నుంచి పాదయాత్రగా వెళ్లే భక్తులకు మార్గ మద్యలో అల్పాహారంను పంపిణీ చేశారు.

సమితి సభ్యులు ప్రతి యేడాది రెండు రోజుల పాటు భక్తులకు పావ్ బాజీ, ఇతర అల్పాహారాలను అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సారి కూడా భక్తులకు అల్పాహారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అల్పాహారం పంపిణీ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

