కేవీసీఎస్ లో పండగ సంబరాలు..!
– అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
– ఆకట్టుకున్న దసరా ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు, ముందస్తు దసరా వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు.

ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్టించిన దుర్గామాతకు పూజలు నిర్వహించి.. బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు, మహిళ ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఉత్సహాంగా ఆడిపాడారు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.., ఒక్కేసి.. పువ్వేసీ.. చందమామా.. అంటూ పాటలకు లయబద్ధంగా అడుగులు వేస్తూ ఉత్సహంగా సంబరాలు జరుపుకున్నారు. మరోవైపు ముందస్తు దసరా సంబరాలను కూడా అట్టహాసంగా నిర్వహించారు. ఉత్సవాలో రావణ సంహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాణా సంచాలు పేలుస్తూ వేడుకలసు సందడిగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. అదేవిధంగా విజయదశమి విజయానికి ప్రతీగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

