నెలకో చోరీ..!
– మూడు కేసుల్లో నలుగురి రిమాండ్
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓకే ప్రాంతానికి చెందిన నలుగురు నిందితులు నెలకో చోరీకి పాల్పడ్డారు. మూడు నెలల్లో మూడు దొంగతనాలు చేసిన ఈ నలుగురికి తాండూరు పట్టణ పోలీసులు కటకటాల్లోకి పంపారు. ఆదివారం తాండూరు పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని హరిజన్ వాడకు చెందిన అబ్దుల్ రహీరం రైల్వే స్టేషన్‌లో చిరుతిళ్ల సేల్స్ మేన్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని పూడుర్ గల్లికి చెందిన మహమ్మద్ ఫయాజ్ పండ్గ వ్యాపారం చేస్తున్నాడు. కర్బలా వైదాన్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సమీర్ అనే యువకుడు బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సీతారంపేట్ చెంగోల్ బస్తీకీ చెందిన మహమ్మద్ ఇంతియాజ్ ఆంటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరంతా గత ఏప్రిల్‌లో మార్వాడి బజార్‌లో ఉన్న ఓ కూలర్ గోదాంలో మూడు కూలర్లను అపహరించారు. మే నెలలో పాత తాండూరు బీసీ హాస్టల్‌లో ఐదు సిలిండర్లు, 20 కేజీల కందిపప్పు, 17 లీటర్ల నూనేతో పాటు తదితర వస్తువులు దొంగలించారు. అదేవిధంగా జూన్ నెలలో పెద్దేముల్ మండల పోలీస్టేషన్ పరిధిలోని గొట్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్‌కు సంబంధించిన వస్తువులను చోరీ చేశారు.
దొరికిపోయారిలా…
——————–
నెలకో చోరీ చేసిన నలుగురు నిందితులు దాదాపు రెండు నెలల తరువాత పట్టుబడ్డారు. శనివారం రాత్రి తాండూరు రైల్వేస్టేషన్ పరిధిలో అనుమాస్పదంగా కనిపించిన వీరిని విచారించగా పొంతనలేని సమాధానాలను ఇచ్చారు. దీంతో పోలీసులు వారిని పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించడంతో అడ్డంగా దొరికిపోయారు. దీంతో మూడు నెలల్లో చేసిన చోరీలలో నుంచి రెండు కూలర్లు, ఐదు సిలిండర్లు, కంప్యూటర్ వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజేందర్‌రెడ్డి వెల్లడించారు.