తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌ను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్‌కు ఉత్తమ ఆర్డీఓ అవార్డు వరించడం పట్ల మంగళవారం బీజేపీ జిల్లా నాయకులు నరుకుల నరేందర్‌గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్‌లు ఆర్డీఓను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
దీనిని పురస్కరించుకుని నరేందర్‌గౌడ్, కౌన్సిలర్ సంగీత ఠాకూర్‌లు ఆర్డీఓ అశోక్ కుమార్‌ను శాలువా, పూల మాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ప్రాంత అభివృద్ధికి ఆర్డీఓ అశోక్ కుమార్ అందించిన సేవలకు గాను ఉత్తమ అవార్డు రావడం ఎంతో సంతోషకరమన్నారు. తాండూరుకు మరిన్ని ఉత్తమ సేవలను అందించాలని ఆర్డీఓను కోరారు.
