దుర్గామాత సేవలో..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దుర్గామాత సేవలో..!
– తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి
– తాండూరులో ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దుర్గామాత సేవలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్ రెడ్డి శరన్నవరాత్రుల సందర్భంగా పట్టణంలోని బసవణ్ణ కట్ట వద్ద ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకున్నారు. వేధ పండితుల మంత్రోచ్చరణల మద్య అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ హేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృప అందరికి సిద్ధించాలని ప్రార్థించారు. శరన్నవరాత్రుల ఉత్సవలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, డా. సంపత్ కుమార్, సిద్రాల శ్రీనివా స్, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు, నాయకులు బిడ్కర్ రఘు, బీదర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మహేందర్ రెడ్డిని శుభాకాంక్షల వెల్లువ