తాండూరు ఇంటర్ బాలికలకు శుభవార్త..!
– ఉచితంగా ఎంసెట్ శిక్షణ తరగతులు
– పట్టణంలో ఈనెల 23 నుంచి ప్రారంభం
– సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చదువుకుంటున్న బాలికలకు సేవా భారతతీ, హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు శుభవార్త చెప్పారు. రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్ బాలికలకు ఉచిత ఈఏపీసెట్(ఎంసెట్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శనివారం మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉచిత ఎంసెట్ శిక్షణకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. తాండూరులోని భాష్యం కాలేజీలో సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ సమావేశం జరిగింది. ఈనెల 23 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

తాండూరులోని సాయిపూర్ రోడ్డు మార్గంలో ఉన్న భాష్యం జూనియర్ కాలేజీలో బాలికల ఎంసెట్ శిక్షణ తరగతులు జరుగుతాయని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయని వెల్లడించారు. ఎంసెట్ లో నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందంతో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గాజుల బస్వరాజ్ తెలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ ను కూడా అందజేస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న ఇంటర్ విద్యార్థినులు రూ.500 చెల్లించి తమపేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రవేశం కొరకు ఫోన్ నెంబర్ 9290082155, 9030056755, 9491379769, 9397392248లో బాలికలు సంప్రదించాలని సూచించారు. ఈనెల 22తో ప్రవేశాల గడువు ముగుస్తుందని తెలిపారు. ఉచిత ఎంసెట్ శిక్షణకు సహకారం అందిస్తున్న సేవా భారతితో పాటు అధ్యాపక బృందంకు బస్వరాజ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధులు రమేష్, చిట్టిబాబు(ప్రవీణ్), హిందూ ధార్మిక పరిషత్ ట్రస్టీలు నరేందర్, వేణుగోపాల్ రెడ్డి, పటేల్ విజయ్, అధ్యాపకులు పర్యాద రామక్రిష్ణ, రాము లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

