మహేందర్ రెడ్డిని శుభాకాంక్షల వెల్లువ
– సన్మానించిన తాండూరు నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్ రెడ్డిని పలువురు నాయకులు సన్మానించారు. పట్టణంలోని డా. సంపత్ కుమార్ నివాసంలో ఆయనతో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ లు మహేందర్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ నివాసంలో ఆమెతో పాటు భర్త, నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు తాండూరు ఉర్దూ ఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్ నివాసంలో ఆయన తో పాటు ఎంఐఎం నేత అబ్దుల్ హాది, మైనార్టీ నేతలు మహేందర్ రెడ్డిని సన్మానించి శుభాకంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు పరిమళ రవీందర్, ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్, రాము, నాయకులు బిడ్కర్ రఘు, బీదర్ రాజశేఖర్, కోర్వార్ నగేష్, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

