బీఆర్ఎస్ కు చిత్తశుద్ది లేదు
– అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించిన సర్కారు
– ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు
– కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై చిత్త శుద్ధి లేకుండా పోయిందని తాండూరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్లో సర్కారు అంకెల గారడిని ప్రదర్శించిందన్నారు. దీంతో ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, పాలనపై ఉన్న శ్రద్ద అర్థమవుతుందన్నారు. గత యేడాది బడ్జెట్ జీరాక్స్ కాపీని మళ్లీ ప్రవేశ పెట్టారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు, ఇండ్ల స్థలాలకు నిధుల మాటే ఎత్తలేదన్నారు. కొత్త పథకాలను ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. నిరుద్యోగ భృతి, గిరిజన బంధుపై ఎలాంటి ఊసు ఎత్తలేదని విమర్శించారు. రుణమాఫీపై ఎలాంటి ప్రస్తావన ఎందుకు తీసుకరాలేదో అర్ధం కావడం లేదన్నారు. రుణమాఫీ చేయకుండా ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

