పేకాట స్థావరాలపై ఉక్కుపాదం..!
– జిల్లాలో 9 కేసుల్లో అదుపులోకి 73 మంది
– రూ. 1.98లక్షల నగదు, సెల్ ఫోన్ల స్వాదీనం
– ఒక గంజాయి కేసులో 500గ్రాముల సీజ్
– వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ కె. నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినధి: వికారాబాద్ జిల్లాలో జూలు విధిల్చిన పేకాట జూదంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలతో జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వికారాబాద్, తాండూరు, కోడంగల్, చెన్గోముల్, దౌల్తాబాద్, బొంరాస్ పేట్ పోలీస్టేషన్ల పరిధులతో జరిపిన దాడుల్లో 9కేసులు నమోదుయ్యారు. ఇందులో 73 మందిని అదపులోకి తీసుకుని వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లను స్వాదీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కేసుల వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలోని ఫాతే గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు పేకాట ఆడుతున్న 6 గురిని అదుపులోకి తీసుకోని రూ. 7900లతో పాటు 3 సెల్ ఫోన్లు, అనంత పద్మనాభ షాప్ లో పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకోని రూ. 11,630 రూపాయలు, 6 సెల్ ఫోన్లు సీజ్ చేశారు.
అదేవిధంగా చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకాపూర్ గ్రామంలో పేకాట ఆడుతున్న 6 మందిని అదుపులోకి తీసుకోని రూ. 10,540లు, 3 సెల్ ఫోన్లు, కొడంగల్ పోలీస్టేషన్ పరిధిలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకోని రూ. 31,800లు, 8 సెల్ ఫోన్లు, దౌల్తాబాద్ గ్రామంలో పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకోని రూ. 14,680లు, 10 సెల్ ఫోన్లు, కొడంగల్ పోలీస్టేషన్ పరిధిలోని కస్తూరిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకోని రూ. 13,930లు, 5 సెల్ ఫోన్లు, కోడంగల్ గ్రామంలో 6 మందిని అదుపులోకి తీసుకోని రూ. 13,260లు, 6 సెల్ ఫోన్లు, బొంరాస్‌పేట్ గ్రామంలో 8 మందిని అదుపులోకి తీసుకోని రూ. 14,670లు, 7 సెల్ ఫోన్లు, తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలోని పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకోని రూ. 80,270 రూపాయలు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ 9 సంఘటనల్లో 73 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ. 1,98,780 రూపాయలు, 55 సెల్ ఫోన్స్ సిజ్ చేయడం జరిగిందని తెలిపారు.
అదేవిధంగా వికారాబాద్‌లో గంజాయి కేసులో 500 గ్రామాల గంజాయి స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా పేకాట ఆడిన, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణా లు చేసిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలకు దృష్టిలోకి వస్తే టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సెల్ నెంబర్ 8712670022 ద్వారా సంప్రదించవచ్చని సూచించారు.
ఇదికూడా చదవండి…

