రేపు తాండూరులో పవర్ కట్..!
– గంటల పాటు విద్యుత్ అంతరాయం
– ప్రకటించిన విద్యుత్ ఏడీఈ శంకర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు సోమవారం తాండూరులో విద్యుత్ అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈడీ కె. శంకర్ తెలిపారు.

220/132 కేవీ తాండూరు సబ్‌స్టేషన్లో వార్షిక నిర్వహణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.

పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మరియు తాండూరు రూరల్ సెక్షన్ల పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. కావున ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు ఈ తాత్కాలిక అసౌకర్యానికి సహకరింంచాలని కోరారు.



