వైభ‌వంగా క‌ట్ట మైస‌మ్మ జాత‌ర

తాండూరు వికారాబాద్

వైభ‌వంగా క‌ట్ట మైస‌మ్మ జాత‌ర
– ద‌ర్శించుకున్న నాయ‌కులు, భ‌క్తులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణం ఇందిరానగ‌ర్‌లోని 25వ వార్డులో వెల‌సిన శ్రీ క‌ట్ట మైస‌మ్మ జాత‌ర ఉత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఆదివారం జాత‌ర సంద‌ర్భంగా ఆల‌యంలో వెల‌సిన అమ్మ‌వారిని ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌, పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ జాత‌ర ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని స్థానిక‌ టీఆర్ఎస్ నాయకులు చెన్నారం శేఖర్, రమేష్ టైలర్, శంకర్, గుండప్ప, శ్రీనివాస్, జెట్టుర్ శ్రీనివాస్, కుర్వ అంజప్ప, పాండు, నరేష్, వార్డు ప్రజలు పూజ‌లు నిర్వ‌హించారు.