సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సైన్స్ టాలెంట్ టెస్టులో విద్యార్థుల సత్తా
– జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక
– అభినందించిన జల్లా విద్యాధికారి రేణుకాదేవి
– విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతుల అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్టులో తాండూరు విద్యార్థులు సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తాండూరు పట్టణంలోని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటు ప్రవేటు స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ జీజేసీ పాఠశాలకు చెందిన పి.చరణ్(10వ), బి.నిఖిత(9వ) బి. సింధూ(9వ), తెలుగు మీడియంలో ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలకు చెందిన ఎ. చందు (10వ), బి.లావణ్య (9వ), ఎం.శివాని(8వ)లు ప్రతిభను కనబరిచారు. ప్రవేటు స్కూల్స్ ఇంగ్లీష్ మీడియంలో శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూలుకు చెందిన పి.సాహిత్ రెడ్డి(10వ), టి.కార్తీక రెడ్డి(9వ), సి.ప్రజ్వల్ రెడ్డి(8వ)లు టాలెంట్ టెస్టులో సత్తా చాటారు. గురువారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఆయా పాఠశాలల విద్యార్థులను అభినందించారు. ఏఎంఓ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణలతో కలిసి విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపల్‌, టీచర్లు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఉత్తమ ఫలితాలే లక్ష్యం..!