ప్రారంభానికి సిద్దంగా ప్రభుత్వ భవనాలు
– 30న ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి
– ఏర్పాట్లును చేస్తున్న అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో నిర్మాణాలు పూర్తయిన ప్రభుత్వ భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయి. తాండూరు పట్టణంలోని కొత్త మున్సిపల్ భవనం, హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి, మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలతో పాటు సాయిపూర్‌లోని అంగన్‌వాడి భవనం, పెద్దేముల్ మండలంలోని
ప్రభుత్వ భవనంను కూడ ప్రారంభానికి ముస్తాబయ్యాయి. ఈనెల 30 రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రభుత్వ భవనాలను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. తాండూరులో రూ. 4 కోట్లతో మున్సిపల్ కొత్త భవనాన్ని నిర్మించారు. 150 పడకలతో ఏర్పాటు చేసిన మాతా శిశు ఆసుపత్రికి రూ. 15 కోట్లతో నిర్మించారు. ఇక తాండూరు మండలంలోని జినుగుర్తితో పాటు తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలలను రూ. 18 కోట్ల చొప్పున మొత్తం రూ. 36 కోట్లతో నిర్మించారు. ముందుగా ఈ భవనాలను టీఆర్ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాల్సి ఉండింది. మంత్రిగారి సమయం కేటాయించకపోవడంతో విద్యాశాఖమంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.
