కాటేసిన పామును వెంట తీసుకొచ్చింది

జాతీయం

కాటేసిన పామును వెంట తీసుకొచ్చింది
– ఖంగుతిన్న ఆసుప‌త్రి వైద్యులు
– ఈ సంఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందంటే
ద‌ర్శిని బ్యూరో: పాములు చూస్తేనే చాలా భ‌య‌మేస్తుంది.. ఇక పామును ప‌ట్టుకోవడం ఇంటి గిన్నిస్ బుక్కు ఎక్కిన‌ట్లుగా అనిపిస్తుంది. కాని కాటేసిన పామును వెంట ఆసుప‌త్రికి తీసుకెళ్లి వైద్యుల‌కు చూపిస్తే వైద్యులు షాక్ తిన‌డంతో పాటు చూసిన వాంత ఖంగుతిన్నంత ప‌నైతుంది. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే వైద్యుల‌కు… చూసిన వారికి ఎదురైంది. ఇంత‌కీ ఎక్క‌డ జ‌రిగిందంటే.. కర్ణాటకలోని డెంకణీకోట తాలూకా బయలకాడు గ్రామానికి చెందిన మణి.. కూతురు ఐదేళ్ల సంచనశ్రీ ఇంటి ముందు ఆడుకుంటుంది. ఇంత‌లో అక్క‌డికి వ‌చ్చిన చిన్న సైజు కట్ల పాము ఆమెను కాటు వేసింది. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. వెంటనే పామును కొట్టి సంచిలో వేసుకొని చిన్నారిని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్క‌డ ఆమె త‌ల్లి త‌మ పాపను ఇదే పాము కాటేసిందని వైద్యులకు చూపించారు. మహిళ చేతిలోని పామును చూసి అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగులు భయంతో పరుగులు పెట్టారు. అది ఇంకా బ‌తికే ఉండ‌డంతో దాన్ని చూసిన కొంద‌రు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. కొద్ది సేప‌టి త‌రువాత విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి ఆసుప‌త్రికి తీసుక‌వ‌చ్చిన చిన్నారికి వైద్యం అందించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో చిన్నారిని రక్షించగలిగామని డాక్టర్లు తెలిపారు. పామును ఆసుప‌త్రికి తీసుక‌వ‌రావ‌డం వెనుక కార‌ణ‌మేంట‌ని వైద్యులు పాప త‌ల్లిని అడ‌గ‌గా కాటేసిన పాము ఏదో తెలిస్తే.. వైద్యం చేయడం సులభమవుతోంద‌ని,. అందుకే అలా పామును తీసుకొచ్చినట్లు వైద్యుల‌కు తెలిపింది.