రోజుకో బెల్లం ముక్క..!
– ఊపిరితిత్తులకు ఉండదు డోకా
– గొంతు రక్షణకు కవచంలా నిలిచే సామర్థ్యం
దర్శిని డెస్క్ : మీ ఊపిరితిత్తులు పదికాలాలపాటు పదిలంగా ఉండాలా? శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే రోజుకొక్క చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది తీసుకుంటే చలి నుంచి రక్షణ కలిపించడమేకాకుండా గొంతు రక్షణకు కవచంలా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో బెల్లంను మంచి ఔషధంగా పరిగణిస్తారు.
ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బెల్లం ప్రొఫైల్‌లో మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సహజమైన డిటాక్సిఫైయర్. ఇది ఊపిరితిత్తుల నుంచి హానికరమైన టాక్సిన్స్, కాలుష్య కారకాలను బయటకు పంపడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
ఊపిరితిత్తుల అల్వియోలీలో చిక్కుకున్న కార్బన్ కణాలను తొలగించగల సామర్థ్యం బెల్లంకు ఉంటుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కాలుష్యాన్ని తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. బ్రోన్కైటిస్, వీజింగ్, ఆస్తమా వంటి ఇతర శ్వాసకోశ రుగ్మతలను సైతం నివారిస్తుంది. బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తితో పాటు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి బెల్లం బాగా పనిచేస్తుంది.
బెల్లం సమర్థవంతమైన ఆక్సిజన్ రవాణాదారుగా పనిచేస్తుంది. కలుషితమైన గాలి కణాలు, రసాయన కణాలు గొంతులో చేరి చికాకు కలిగిస్తుంటే.. బెల్లంను గోరువెచ్చని నీటితో కలిపి సేవిస్తే, అది గొంతుపై రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది గొంతులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఈ కణాల వల్ల కలిగే దగ్గును తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బెల్లం ఎంతో సహాయపడుతుంది.
ఇదికూడా చదవండి..

