సర్కారు దవాఖానలో కలేక్టర్ భార్య ప్రసవం
– ప్రశంసిస్తున్న అధికారులు, నెటిజన్లు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలతో ప్రభుత్వాస్పత్రిలో ప్రసవం చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని ఓ జిల్లా కలెక్టర్ తన భార్యకు గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రసవం చేయించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీత్ సతీమణి మాధవి భద్రాచలం ప్రభుత్వ దవాఖానలో బుధవారం ఉదయం మగశిశువుకు జన్మనిచ్చారు. హోదా, అధికారం ఉన్నప్పటికీ సామాన్యురాలిలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రజలకు విశ్వాసం కలిగించే ఉద్దేశంతోనే కలెక్టర్ తన భార్యను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.