హమ్మయ్యా.. అదృశ్యమైన బాలిక దొరికింది..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

హమ్మయ్యా.. అదృశ్యమైన బాలిక దొరికింది..!
– ఇన్ని రోజులు సస్పెన్స్‌కు తెర
– ఊపిరి పీల్చుకున్న పోలీసులు
– ఎలా.. ఎక్కడ దొరికిందంటే..?
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటి నుంచి వెళ్లిపోయి అదృశ్యమైన 9 ఏండ్ల బాలిక స్వాతీ ఆచూకీ లభించింది. దాదాపు 16 రోజుల తరువాత బాలిక ఆచూకీ తెలియడంతో హమ్మయ్యా అంటూ పోలీసులు, కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన బక్క లాలమ్మ మనుమరాలు స్వాతి(9) ఈనెల 22న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైంది. రెండో రోజే లాలమ్మ తన మనుమరాలు అదృశ్యమైనట్లు కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక అదృశ్యం కావడంతో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పుకార్లు రావడంతో సంఘటన ఆందోళన రేపింది.

ఫిర్యాదు తీసుకున్న నాటి నుంచి ఎస్ఐ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. బృందాలను ఏర్పాటు చేసి జల్లెడ పట్టారు. అదృశ్యమైన రోజు బాలిక కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు గుర్తించారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఆటోలతో పాటు ప్రయాణ మార్గాలలో బాలిక ఫోటో చూపిస్తూ విస్తృతంగా గాలింపు చేశారు. దాదాపు 16 రోజుల తరువాత బాలిక ఆచూకీని కనిపెట్టారు. తాండూరులో అదృశ్యమైన బాలిక హైదాబాద్‌లో అక్కడి పోలీసులు గుర్తించి కరణ్‌ కోట్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ విఠల్ రెడ్డి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించారు. బాలికను అదుపులోకి తీసుకున్న తరువాత పూర్తి వివరాలను సేకరించనున్నారు. బాలికను జిల్లాలోని బాలికా సదనంలో చేర్పించాలని చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టకేలకు అదృశ్యమైన బాలిక క్షేమంగా దొరకడంతో ఉత్కంఠతకు తెరపడింది.

ఇదికూడా చదవండి..

కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కచ్చి ఓవైస్