వసతిగృహం.. అప్రమత్తం..!

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

వసతిగృహం.. అప్రమత్తం..!
– ఉదయం నుంచే వైద్య శిబిరం
– వరుస తనిఖీలతో హడావుడి
– సందర్శించిన అధికారులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల వసతి గృహంలో అప్రమత్తత వాతావరణం ఏర్పడింది. మంగళవారం వసతిగృహంలోని విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో వసతి గృహంలో వరుసగా తనిఖీలు, రాజకీయ నాయకుల సందర్శనలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు హాడావుడి ఏర్పడింది. ఉదయం నుంచి వసతి గృహంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఆసుపత్రి వైద్యులు బాలికలకు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు ఇచ్చారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఉదయం నుంచి వసతి గృహంలో ఉండి రోజు వారి పనులను పర్యవేక్షించారు. తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు. కౌన్సిలర్ నీరజాబాల్ రెడ్డిలు వైద్య శిబిరం, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి వసతి గృహాన్ని సందర్శించారు.

బాధిత బాలికలతో కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అప్పటికే విద్యార్థినిల తల్లులు, కుటుంభీకులు, బందువులతో వసతి గృహానికి చేరుకున్నారు. అధికారులతో కలిసి తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లు వసతిగృహాన్ని తనిఖీ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మహిళ సోసైటీ కార్పోరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి, ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత. డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, కాంగ్రెస్ నాయకులు సందర్శించారు.

ఇదికూడా చదవండి…

ఫుడ్ పాయిజన్ బీఆర్ఎస్ కుట్రే..!