పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోరం..!
– కారు, లారీ ఢీకోని రోడ్డు ప్రమాదం
– కుటుంబంలోని ఆరుగురికి గాయాలు
– ఓ మహిళ పరిస్థితి విషయం, హైదరాబాద్ తరలింపు
– నుజ్జునుజైన కారు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదంను నింపింది. కారు, లారీ ఢీకోన్న ఘటనలో కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాల పాలు కాగా, ఇందులో ఓ మహిళ పరిస్థితి విషమంగా మారింది. ఆమెను వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంభీకుల కథనం మేరకు తాండూరు పట్టణం శివాజీ చౌక్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్(46) తన చెల్లెల్లు అనిత(36), మరదలు అశ్విని(34), అత్త బాలమణి(60), తమ్ముని కూతుళ్లు సమీక్ష(12), షణ్ముఖప్రియ(11)లతో కలిసి జహీరాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లి వేడుకకు కారులో బయల్దేరి వెళ్లారు.

పెళ్లి అనంతరం అదే కారులు తాండూరుకు తిరుగు ప్రయాణం అయ్యారు. తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోకి రాగానే జహీరాబాద్‌ వైపు వెళుతున్న ఓ లారీ కారును ఎదురుగా వెళ్లి ఢీ కొట్టింది. ఈప్రమాదంలో శ్రీనివాస్‌తో పాటు అందరికి గాయాలయ్యాయి. ఇందులో ఆయన చెల్లెల్లు అనిత తలకు తీవ్రగాయాలయ్యాయి. లారీ ఢీకొన్న వెంటనే కారు నుజ్జునుజ్జు అయిపోయింది. గమనింంచిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మిగతా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అనిత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంభీకులు బోరున విలిపిస్తున్నారు. మరోవైపు సంఘటన స్థలంలోని దృశ్యాలు బయాందోళనను కలిగించాయి.

ఇదికూడా చదవండి…

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు..