ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు..

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు..!
– ఎప్పటి వరకు పోడగించారో ప్రకటన
– అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచన
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షా ఫీజు చెల్లింపు గడువును మరోసారి పొడగించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పరీక్ష ఫీజు చెల్లింపు కోసం డిసెంబర్ 25 తేదీ వరకు గడువు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ గడువును డిసెంబర్‌ 31 తేదీ వరకు పొడగించారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్‌ బోర్డు సూచించింది.

మార్చి నుంచి పరీక్షలు
మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే ప్రకటించారు. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఆ మరుసటి రోజు నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 20వ తేదీ వరకు జరగనున్నాయి. అంతకుముందే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22 వరకు ప్రయోగ పరీక్షలు జరుగనున్నాయి.

ఇదికూడా చదవండి…

ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..!