మైనర్లు, యజమానులకు షాక్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మైనర్లు, యజమానులకు షాక్..!
– చేసిన తప్పుకు భారీగా జరిమాన
– ఇద్దరు మందుబాబులకు జైలు
– సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ తీర్పు
– వివరాలు వెల్లడించిన తాండూరు పట్టణ సీఐ
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన మైనర్లు, యజమానులతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపించిన మందుబాబులకు విరాబాద్ జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి జరిమాన విధించినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇద్దరికి జరిమానతో పాటు జైలు శిక్ష కూడా వేసినట్లు తెలిపారు. శుక్రవారం ఓ ప్రకటనలో కేసుల వివరాలను వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన అంతారం గ్రామానికి చెందిన గుండప్ప, కరణ్ కోట్ గ్రామానికి చెందిన ఎల్లప్పలకు ఇద్దరికి ఒకరోజు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 1 వెయ్యి చొప్పున జరిమాన విధించారని తెలిపారు.

వారితో పాటు మరో 13 మందికి రూ.1 వెయ్యి చొప్పున జరిమాన విధించారని వెల్లడించారు. అదేవిధంగా గురువారం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన 15 మంది మైనర్లు, వారి వాహన యజమానులకు కూడా ఒక్కొక్కరికి రూ.2500ల చొప్పున జరిమానాలు విధించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించిన వాహనాలు నడిపినా, రోడ్డు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపినా, వయస్సు నిండకుండా మైనర్లు వాహనాలతో రోడ్లపైకి వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి….

శ్రీవారి కృప అందరిపై ఉండాలి