ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 పోస్టులు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 పోస్టులు
– నోటీఫీకేష‌న్ జారీ చేసిన ప్ర‌భుత్వం
– మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు

హైద‌రాబాద్, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా ఉద్యోగ‌వ‌కాశాల‌ను ప్ర‌భుత్వం తాజాగా మ‌రో శుభవార్త చెప్పంది. కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి, గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామ‌కాల మండ‌లి నోటిఫికేష‌న్ జారీ చేసింది. 6 ర‌వాణా కానిస్టేబుల్(హెచ్‌వో) పోస్టులు, 57 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) పోస్టులు, 614 ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు. కానిస్టేబుల్ పోస్టుల‌న్నింటికి వ‌య‌స్సు, విద్యార్హ‌త‌లు పోలీసుశాఖ‌లో ఏవిధంగా ఉంటాయో ఆ విధానాలే వ‌ర్తిస్తాయ‌ని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామ‌కాల మండ‌లి తెలిపింది. అభ్య‌ర్థులు 18 ఏండ్లు నిండి 22 ఏండ్ల మించ‌కుండా ఇంట‌ర్ పాసై ఉండాల‌ని వెల్ల‌డించింది. ర‌వాణా శాఖ‌లో పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు దారుల‌కు లైట్ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల‌ని స్ప‌ష్టం చేసింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల‌కు స్థానిక ఓసీ, బీసీ కులాలైతే రూ. 800లు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ. 400లు, స్థానికేత‌రులుగా ఎవ‌రైనా రూ. 800లు ద‌ర‌ఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది.