మైనర్ల డ్రైవింగ్‌కు కళ్లెం..!
– వాహనాల యజమానులకు పోలీసుల షాక్
– 20 మందిపై కేసు, కోర్టులో హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డుపై మైనర్లు బైకులతో దూసుకొచ్చే దూకుడుకు తాండూరు పోలీసులు కళ్లెం వేస్తున్నారు. అర్హత లేకుండా నడిపిస్తున్న వారిని తనిఖీలు చేస్తూ వాహనాలు అందించిన యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా తాండూరులో బైకులు నడిపిస్తూ పట్టుబడిన మైనర్ల విషయంలో 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని కాలేజీలు, స్కూళ్ల వద్ద తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు.

ఈ తనిఖీలలో 18 ఏండ్లు నిండకుండా వాహనాలు నడిపిస్తున్న 20 మంది మైనర్లను గుర్తించడం జరిగిందని వెల్లడించారు. మైనర్లకు వాహనాలు నడిపించేందుకు ఇచ్చిన వాటి యజమానులపై ఎంవీ యాక్టు కింద కేసులు నమోదు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మైనర్లకు బైకులు, వాహనాలు నడిపించేందుకు ఇవ్వరాదన్నారు. ఇస్తే కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఇదికూడ చదవండి…

