విద్యుత్ శాఖలో 3వేలకు పైగా ఉద్యోగాలు..!
– భర్తి కోసం త్వరలో నోటిపికేషన్
– పోస్టులు, అర్హత గురించి తెలుసుకోండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఏర్పడుతున్న ఉద్యోగాలను భర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల్లోని ఖాళీల కోసం ఎప్పటికప్పుడు నోటిపికేషన్లను జారీ చేస్తోంది. తాజాగా విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో త్వరలో 3,260 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి దక్షిణ తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
ఉద్యోగ ఖాళీలుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక కూడా సమర్పించారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతుంది.
భర్తి చేయబోయే పోస్టులు ఇవే..
రాష్ట్రంలోని విద్యాశాఖలో జూనియర్ లైన్ మెన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ లైన్ మెన్ 2,812 పోస్టులు , సబ్ ఇంజనీర్ 330 పోస్టులు , అసిస్టెంట్ ఇంజనీర్ 118 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. మొత్తం 3,260 పోస్టులు భర్తీ చేస్తారు. అయితే JLM ఉద్యోగాలకు 10th + ITI పూర్తి చేసిన వారు అర్హులు కాగా.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన వారు సబ్ ఇంజనీర్ ఉద్యోగాలకు, BE లేదా B.Tech పూర్తి చేసిన వారు అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హులు.
ఇదికూడా చదవండి…

