రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతుల కోసం దర్నాకు బీఆర్ఎస్‌ సిద్దం
– హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– జయప్రదం చేయాలని నేతల పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ దర్నాకు సిద్దమైంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తాండూరులో దర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీంలు ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి గారు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు అధిక సంఖ్యలో హాజరై దర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఇదికూడా చదవండి…

సాయిమేధలో ‘రక్షాబంధన్’ వేడుకలు..