నాట్య మయూరి ధన్యశ్రీ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నాట్య మయూరి ధన్యశ్రీ..!
– శ్రీశైలం దేవస్థానంలో కూచిపూడి ప్రదర్శన
– నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్న చిన్నారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి నాట్య మయూరీలా మెరిసింది. శ్రీశైల దేవస్థానంలో అతిచిన్న వయస్సుల్లోనే కూచిపూడీ నాట్యంలో అద్బుత ప్రదర్శనతో అందరి హృదయాలను ఆకట్టుకుంది. వివరాల్లోకి వెళితే… వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో నివసిస్తున్న సరితగోపాల్ దంపతుల కూతురు ధన్విశ్రీ స్థానిక శ్రీ నేతాజీ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతోంది. అతిచిన్న వయస్సులోనే నాట్యంపై మక్కువ పెంచుకుంది. ఇందుకు తల్లిదండ్రులు సైతం చిన్నారిని ప్రోత్సహించారు.

ఆదివారం శ్రీ శ్రీశైల దేవస్థానంలో నిర్వహింపబడిన సాంస్కృతిక కార్యక్రమంలో చిన్నారి ధన్యశ్రీ పాల్పంచుకుంది. దేవస్థానం ధర్మపథం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై చిన్నారి కూచిపూడీ నాట్యంతో అత్యుత్తమమైన ప్రదర్శన అబ్బుర పరిచింది. చిన్నారి నాట్యానికి అందరు సమ్మోహనం చెంది ప్రశంసల జల్లు కురిపించారు. ఒకటవ తరగతిలోనే ఇంతటి ప్రతిభను కనబరచడంతో వారి కుటుంబంతో పాటు డాన్స్ టీచర్ మంజుల, సన్నిహితులు సంద్య, శివకుమార్ దంపతులు, పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ చిన్నారిని అభినందించారు.

ఇదికూడా చదవండి…

 

రామ జపం చేద్దాం..!