రూ.3 లక్షల ఆస్తిపన్ను బకాయి వసూలు

తాండూరు రాజకీయం వికారాబాద్

రూ.3 లక్షల ఆస్తిపన్ను బకాయి వసూలు
– పాలశీతలీకరణ కేంద్రం నుంచి స్వీకరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల నుంచి ఆస్తిపన్నులను అధికారులు వసూలు చేస్తున్నారు. ఆదివారం పట్టణంలోని అంతారం రోడ్డు మార్గంలో ఉన్న పాల శీతలీకరణ కేంద్రం నుంచి రూ. 3 లక్షల 2 వేల 454లను వసూలు చేశారు. ఈ కేంద్రం ద్వారా 2018 నుంచి 2023 వరకు ఆస్తి పన్నులు బకాయి పడిందని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శీతలీకరణ కేంద్రం నుంచి బకాయిలు మొత్తం వసూలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, పలుశాఖల అధికారులు మున్సిపల్ ఆస్తి పన్ను బకాయిలు మొత్తం చెల్లించాలని మేనేజర్ నరేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బిల్ కలెక్టర్లు ఉన్నారు.