ఉద్యమ కారులకు ఊరట..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఉద్యమ కారులకు ఊరట..!
– 7 ఏండ్ల నాటి కేసు కొట్టివేత
– సంతోషం వ్యక్తం చేసిన ఉద్యమ కారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ కారులకు ఊరట లభించింది. వారిపై నమోదైన కేసును తాండూరు జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2017లో అప్పటి తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయూబ్ ఖాన్ ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తోటి ఉద్యమ కారులు అయిన వెంకటేష్ చారీ, భాను ప్రసాద్, ఫీరోజ్ ఖాన్, ఆరీఫ్, సాదిక్ లు అయూబ్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ దర్నా, రాస్తారోకో చేపట్టారు.

దీంతో అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పందించి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారు. అయితే రాస్తారోకో, దర్నాలో పాల్గొన్న వారిపై అప్పట్లో కేసు నమోదయ్యింది. గత 7 ఏండ్లుగా కేసు నమోదైన ఉద్యమ కారులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం తాండూరు న్యాయస్థానంలో కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు వెల్లడైంది. ఈ మేరకు ఉద్యమ కారులు హర్షం వ్యక్తం చేశారు. కేసును వాదించిన న్యాయవాది గోపాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు కోర్టు కె సులో ఊరట లభించినందుకు గాను అయూబ్ ఖాన్ కుటుంబ సభ్యులు ఉద్యమకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ న్యాయవాదులు వాణిశ్రీ, కలాం, ఫయాజ్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

పార్కుల అభివృద్ధే ధ్యేయం..!