నామం భజే.. రామం.. భజే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నామం భజే.. రామం.. భజే..!
– తాండూరులో ఘనంగా అయోధ్య వార్షికోత్సవం
– దేవాయాల్లో రామజపం చేసిన భక్తులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : నామం.. భజే… శ్రీరామం.. భజే.. అంటూ తాండూరు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామున్ని తలుచుకున్నారు. అయోధ్యలో బాల రామమందిరం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తాండూరు హిందూ ఉత్సవ సమితి, తాండూరు బ్రాహ్మణ అర్చక, పురోహిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ఉత్సవాలు జరుపుకున్నారు. పట్టణంలోని పలు దేవాలయాల్లో వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం 109 సార్లు శ్రీరామ నామ జపం చేశారు.

హనుమాన్ చాలీసా పటించారు. పట్టణంలోని ఇందిరానగర్ రామ మందిరంలో నిర్వహించిన ఉత్సవాలలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరయ్యారు. భక్తులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంరతం శ్రీరామ నామ జపం పటించారు. అదేవిధంగా తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్ లో వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో మహిళలు, భక్తులు అయోధ్య వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకున్నారు. మరోవైపు పట్టణంలోని సీతారంపేట్ హానుమాన్ దేవాలయం, పాత తాండూరు ఆంజనేయ స్వామి దేవాలయం, ఇందిరానగర్, మల్ రెడ్డిపల్లి, సాయిపూర్ లలో హానుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య ఉత్సవాలతో తాండూరు పట్టణంలో అధ్యాత్మిక వాతావరణం వెల్లి విరిసింది.

ఇదికూడా చదవండి…

వార్డు సభలో భగ్గుమన్న విభేదాలు..!