కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత శ్రీనివాస్‌రెడ్డికి లేదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ను విమర్శించే అర్హత శ్రీనివాస్‌రెడ్డికి లేదు..!
– వార్డు సభలో కావాలనే చౌకబారు రాజకీయాలు
– మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డికి లేదని ఆ పార్టీ నేతలు విమర్శించారు. బుధవారం పట్టణంలోని 13వ వార్డులో నిర్వహించిన వార్డుసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి మద్య వాగ్వివాదం జరిగి సంగతి తలిసిందే. ఈ సంఘటనపై గురువారం 13వ వార్డుకు చెందిన కాంగ్రెస్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ మక్సూద్, మహమూద్, రవీందర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నీరటి రామలింగం, లొంక బాలరాజులు మీడియాతో మాట్లాడారు. వార్డు సభలో శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన తీరును ఖండించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత అయనకు లేదన్నారు. అభివృద్ధి విషయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి స్వార్థపూరితంగా నడుచుకున్నారని అన్నారు. కేవలం తన ఇంటి చుట్టు ఉన్న ప్రాంతాలను మాత్రమే అభివృద్ధి చేసుకున్నారని అన్నారు. కోకట్ రోడ్డు, మిత్రానగర్‌, రెడ్డి కాలనీలో ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పినా బీఆర్ఎస్ పార్టీ, వ్యక్తిగత కారణాలతో నిధులు అవసరం లేదని అన్నారని ఆరోపించారు. నిధులు ఎవ్వరు ఇచ్చినా వార్డు అభివృద్ధికి కృషి చేయాల్సింది పోయి కావాలనే అభ్యంతరం చేశారని అన్నారు. డబ్బుల కోసమే చిలుక వాగులో పనులు చేశారని విమర్శించారు. నాలుగు రోజులైతే పదవి కాలం పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

జోహార్.. సుభాష్ చంద్రబోస్..!