బీఆర్ఎస్ తడాఖా చూపిస్తాం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ తడాఖా చూపిస్తాం..!
– కాంగ్రెస్ పార్టీకి ఫుల్ సినిమా కనిపిస్తది.
– బల్దియాపై గులాబీ జెండా ఎగరడం పక్కా
– జేబులు నింపుకోవడమే ఎమ్మెల్యే పని
– ఎన్నికల్లో విస్మరించిన హామీలపై నిలదీయండి.
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– హస్తం వీడి గులాబీ గూటికి మాజీ కౌన్సిలర్ పరిమళ
– గడ్డలి రవీందర్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు
– అదే బాటలో ఇతర వార్డుల కాంగ్రెస్ కార్యకర్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తడాఖా ఎంటో చూపిస్తామని.. కాంగ్రెస్ పార్టీకి ఫుల్ సినియా కనిపిస్తదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్ లో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ, గడ్డలి రవీందర్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు తాండూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 దొంగ హామీలు ఇచ్చి మోసం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ హాయాంలో రెండేళ్లలో రూ.1600 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుత తాండూరు ఎమ్మెల్యే రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని అన్నారు. తాజాగా తాను తీసుకవస్తున్నట్లు చెబుతున్న రూ. 18 కోట్ల నిధుల్లో 15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అని.. ఎమ్మెల్యే తీసుకవచ్చింది.. కేవలం రూ.3కోట్లు మాత్రమే అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హాయాంలో సాధించిన నిధులనే కొత్తగా మంజూరు చేయిస్తున్నట్లు విమర్శించారు. ఎమ్మెల్యేకు ఇచ్చిన హామీలు విమర్శించి.. జేబులు నింపుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలో సొంత తమ్ముడితో పాటు పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజర్ మాత్రమే కనిపించదని.. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికల్లో అధికార పార్టీకి ఫుల్ సినిమా కనిపించడం పక్కా అని అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీని నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, రామన్న రోజుల్లో చేరికలు పెరగడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కాస్కో.. అని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బంపర్ మెజార్టీలతో గెలిపించుకోవాలని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరికలు
కాంగ్రెస్ పార్టీలో నుంచి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పరిమళ, సీనియర్ నాయకులు గడ్డలి రవీందర్ ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు భారీ ఎత్తున జరిగాయి. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పరిమళ, రవీందర్ లతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 23వ వార్డు కార్యకర్తలతో పాటు పట్టణంలోని 14వ వార్డు, ఇతర వార్డులకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మహిళ నాయకులు అనురాధ, శకుంతల దేశ్ పాండే, మాజీ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, సంగీత ఠాకూర్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, యూనుస్, భషరత్, వార్డు ఇంచార్జ్ సందీప్ రెడ్డి, ఇంతియాజ్, వివిధ వార్డుల కార్యకర్తలు, నేతలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

23వ వార్డులో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం..!