రక్తం పంచిన ‘మంచ్’ మనుసులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రక్తం పంచిన ‘మంచ్’ మనుసులు..!
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
– విద్యార్థులకు పేట్లు, బాటిళ్ల వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు. మార్వాడి యువమంచ్ సభ్యులు రక్తదానం చేసి మంచి మనసును చాటుకున్నారు. ఆదివారం మార్వాడి యువమంచ్ నాయకులు పట్టణంలోని బాలాజీ మందిరంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తాండూరు పట్టణ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం వైద్యుల పర్యవేక్షణలో బ్లడ్ బ్యాంకులో పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొని దాదాపు 27యూనిట్ల రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు మంచ్ ప్రతినిధులు, నేతలు ప్రశంస పత్రాలను అందజేశారు.

మరోవైపు అంతకుముందు యాలాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్టీలు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, క్రికెట్ బ్యాట్, బాల్స్, వాలీబాల్, స్కిప్పింగ్స్, ఇతర క్రీడా సామాగ్రి, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణి చేసి సంతోషంగా వె డుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ తాండూరు అధ్యక్షులు అనిల్ సార్డా, జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, కుంజ్ బిహారి సోని, సన్ని అగ్రవాల్, మంచ్ అధ్యక్షులు కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, పవన్ పండిత్, దినేష్ పర్తాని, కిషన్ రాఠీ, రమాకాంత్ పండిత్, కరణ్ జైన్, మాజీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్ లో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు