తాండూరులో ఉచిత వైద్య శిబిరం
– ఫ్రీగా వినికిడి పరీక్షలు, ఫిజియోథెరపీ చికిత్సలు
– వెల్లడించిన వైద్యులు డా.నరేష్, డా. రమ్య
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రేపు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పట్టణంలోని శ్రీ హరిహరణ్ క్లీనిక్ వైద్యులు డా.నరేష్, డా.రమ్యలు
తెలిపారు. ఆదివారం తాండూరు పట్టణం శాంతినగర్‌లోని క్లీనిక్ ఆధ్వర్యంలో ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, దీంతో పాటు ఉచితంగా ఫిజియోథెరపీ చికిత్స అందించడం జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందించడం జరుగుతుందన్నారు. వినికిడి లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. లోపం ఉన్న వారికి అందించే పరికరాలపై డిస్కౌంట్ కూడా లభిస్తుందని స్పష్టం చేశారు. తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

