మహాకుంభ మేళాలో మనోళ్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మహాకుంభ మేళాలో మనోళ్లు..!
– పుణ్యస్నానాలు ఆచరించిన తాండూరు భక్తులు
– అక్కడి నుంచి అయోధ్య రామ దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మ హాకుంభ మేళాకు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ భక్తులు పోటెత్తుతున్నారు. నియోజకవర్గంలోని బషీరాబాద్‌ మండల ప్రాంతానికి చెందిన భక్తులు భారీగా మహాకుంభ మేళాకు తరలివెళ్లారు. రెండు ప్రత్యేక బస్సుల్లో దాదాపు 84 మంది కలిసి బయల్దేరి వెళ్లారు. ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడి నుంచి అయోధ్య, కాశీలో కూడా పుణ్యక్షేత్రాల్లో దేవుళ్లను దర్శించుకున్నారు.

మహాకుంభమేళాకు తరలివెళ్లిన వారిలో మండల వాస్తవ్యులు ఎం నాగేంద్రయ్య, రవికుమార్ సుగంధి, మేకల నర్సిములు, మడపతి జగదీశ్వర్, జీవన్గి యాగ విష్ణుమూర్తి, అడ్వకేట్ విశ్వనాథ్(నవల్గా), పలువురు దంపతులు, జీవన్గీతో పాటు కాశీంపూర్ గ్రామస్తులు ఉన్నారు. ప్రయాగరాజ్‌లో స్నానాలు ఆచరించడం.. ఆయోధ్య రామదర్శనం, పుణ్యక్షేత్రాలను సందర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

సోఫా రిపేర్ దుకాణంలో అగ్ని ప్రమాదం..!