ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ఉద్రిక్తంగా బీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్టు
– జావిద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలో బీఆర్ఎస్ కౌన్సిలర్‌ జావిద్ అరెస్టు ఉద్రిక్తంగా మారింది.

సోమవారం తాండూరులో జరిగే రైతు వారోత్సవాల ప్రారంభానికి విచ్చేస్తున్న మంత్రులను అడ్డుకుంటామని కౌన్సిలర్ జావిద్ రెండు రోజుల ముందు ప్రకటించారు. ఈ నేపథ్యంలో యాలాల పోలీసులు ఉదయం కౌన్సిలర్ జావిద్‌ను రాజీవ్ కాలనీ వద్ద అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు.

యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, పోలీసు సిబ్బంది జావిద్ నివాసానికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాలనీ మహిళలు జావిద్‌ను అదుపులోకి తీసుకోకుండా పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు జావిద్‌ను అదుపులోకి తీసుకుని పెద్దేముల్ పోలీస్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ జావిద్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. అధికార పార్టీ దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ఎన్ని నిర్బంధాలు చేసినా అవినీతి, అక్రమాలపై పోరాటం ఆపేది లేదని అన్నారు.

కేంద్రానివి చిల్లర రాజకీయాలు