పుచ్చకాయతో జాగ్రత్త..!
– మోతాదు మించితే విషమే
– ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో తెలుసా..?
దర్శిని డెస్క్ : మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను విరివిగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకనే పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ శరీరంలో నీటీ కొరతను తీర్చి హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి కారణాలతో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మోతాదుకు మించి పుచ్చకాయ తింటే విషంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాచారం ప్రకారం, పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలను మరింతగా పెంచే అవకాశం ఉంది. పుచ్చకాయలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందువల్ల, పుచ్చకాయను ఎక్కువ మొత్తంలో తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే పుచ్చకాయని తక్కువ మోతాదులో తినడం మంచిది.

పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో వాపు వస్తుంది. దీనివల్ల కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. మద్యం సేవించే వ్యక్తులు దీని కారణంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇది మాత్రమే కాదు డయాబెటిస్ సమస్య ఉన్నవారు పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తినాలి. ఎందుకంటే ఇందులోని సహజ చక్కెర మీ బ్లడ్‌షుగర్‌ని పెంచుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.. వేసవి కాలంలో ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది తలనొప్పి, కండరాల బలహీనతకు దారితీస్తుంది.కొంతమందికి పుచ్చకాయ తినడం వల్ల అలెర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల దద్దుర్లు, చర్మం వాపు, మొటిమలు, దురద వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల శరీరం నీటితో నిండిపోతుంది. అధిక హైడ్రేషన్‌తో బాధపడాల్సి వస్తుంది.
ఇదికూడా చదవండి…

