హనీ.. ఈజ్ ద బెస్ట్..!
– చలికాలం రోగాలకు చెక్
– జలుబు, జ్వరం జబ్బులపై ప్రభావం
– బరువు తగ్గడంలో అనుకూలం
దర్శిని డెస్క్: చలికాలం.. రోగాల కాలం. ఈ శీతాకాలంలో రోగాల నుంచి కాపాడుకోవడం అందరికి ముఖ్యమైన చర్య. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. దీంతోపాటు ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరుతుంటాయి. వీటిని నివారించడానికి తేనె చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వచ్చమైన తేనెలో శరీరముకు కావలసిన పోషకపదార్ధాలు ఎన్నో ఉన్నాయి. తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి.
తేనెలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. తేనెలోని గుణాలు అంటు వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. తేనెను తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒక చెంచా తేనెలో ఒక చెంచా నిమ్మరసం కలిపి తాగడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా తేనె తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. ఒక టీస్పూన్ తేనెలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తేనె తీసుకోవడం వల్ల దంత సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఒక చెంచా తేనెలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగితే సైనస్ అదుపులో ఉంటుంది. చలికాలంలో చర్మ సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలికాలంలో వేడినీటికి బదులు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. దీనితో పాటు తేనె తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇదికూడా చదవండి…

